నెల్లూరు జిల్లా సెంట్రల్ జైల్లో ఉన్న రౌడీ షీటర్ శ్రీకాంత్ కేసును పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. అరుణ శ్రీకాంత్ కలిసి చేసిన దందాలపై ఆరా తీస్తున్నారు. అరుణ మొబైల్ లో రికార్డయిన ఆడియో, వీడియోలను పోలీసులు పరిశీలిస్తున్నారు. అరుణ అరాచకాలకు సహకరించిన పోలీస్ అధికారులు ఎవరు..? అనే దానిపై కూడా లోతుగా దర్యాప్తు జరుగుతుంది. అరుణ శ్రీకాంత్ కలిసి అనేక దందాలకు పాల్పడ్డారని ఎంతోమంది బాధితులు ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. అయితే వారెవరు బయటకు రాకపోవడంతో అరుణ ఫోన్లో ఉన్న వాయిస్ రికార్డులు ఆధారంగా పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.