విజయవాడలో వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభమయ్యా యని, నిర్వాహకులు నిబంధనలు పాటించాలని మాచవరం సీఐ ప్రకాశ్ సోమవారం సూచించారు. విద్యుత్ కనెక్షన్లకు అధికారుల అనుమతి తప్పనిసరి అని ఆయన తెలిపారు. మండపాల నిర్మాణ పనులను నిపుణులతో మాత్రమే చేయించాలని, రోడ్లను పూర్తిగా మూసివేయకుండా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు. డీజేలకు అనుమతి లేదని, రాత్రి 10 గంటల తర్వాత మైక్ వాడకం నిషేధమని సీఐ స్పష్టం చేశారు.