శుక్రవారం రోజున చిల్కానగర్ ఉప్పల్ ప్రధాన రహదారి బాక్స్ కల్వర్టు పనులు పర్యవేక్షించిన చిలుకానగర్ డివిజన్ కార్పొరేటర్ జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మాజీ సభ్యురాలు బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్. చిల్కానగర్ ఉప్పల్ ప్రధాన రహదారి బాక్స్ కల్వర్టు పనులను సుమారు 17 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించడం జరిగిందని, బీరప్ప గడ్డ మరియు కాలనీలలో నుండి వచ్చే వర్షపు నీరు ఇరిగేషన్ నాలాలో వెళ్ళుటకు శాశ్వత పరిష్కార దిశగా ఈ కల్వర్టు ఏర్పాటు చేయడం జరిగిందని, త్వరలోనే పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తామని తెలిపారు.