పస్రా ఎస్ఐ కమలాకర్ ఉత్తమ ఎస్ఐగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ములుగు ఎస్పీ శబరీష్ చేతుల మీదుగా నేడు బుధవారం రోజున మధ్యాహ్నం రెండు గంటలకు ఆయన ప్రశంసాపత్రంతో పాటు నగదు రివార్డు అందుకున్నారు. నేరాల నియంత్రణ, పరిశోధనలో చూపిన ప్రతిభకు ఈ అవార్డు లభించినట్లు ఎస్ఐ కమలాకర్ తెలిపారు. ముఖ్యంగా గంజాయి రవాణా, రోడ్డు ప్రమాదాలు, చోరీల నియంత్రణకు తీసుకున్న చర్యలను ఉన్నతాధికారులు గుర్తించి ఈ పురస్కారం అందించినట్లు చెప్పారు.