పెనగలూరు మండలం ఓబిలి పంచాయతీ పరిధి లోని హరిజనవాడలో జరుగుతున్న అదనపు పైపులైను నిర్మాణ పనులను పెనగలూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎస్. విజయ రావు గురువారం పరిశీలించారు. పనులను పర్యవేక్షిస్తున్న సర్పంచ్ చాంద్ భాష ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో మంచినీరు కొరకు మండల గ్రాండ్ లో 5 లక్షల రూపాయలు మంజూరు చేశామని తెలిపారు. గ్రామంలో ఎక్కడెక్కడ వీధి కులాయి ఎలా ఏర్పాటు చేయాలో, దగ్గరుండి ఏర్పాటు చేస్తామని తెలిపారు.