గ్రామీణ ప్రాంత మహిళల్లో హక్కుల పట్ల అవగాహన కార్యక్రమాలు కల్పించడంతో వారు సామాజికంగా, ఆర్థికంగా ఎదగడానికి ఆస్కారం ఉందని ఆశాజ్యోతి ఉమెన్ నెట్వర్కింగ్ ప్రెసిడెంట్ రమణి తెలిపారు. ఈ అవగాహన ద్వారా తమ హక్కులను సాధించి స్వశక్తితో ఎదిగి సమాన హోదా పొందవచ్చు అన్నారు. మహిళల పట్ల జరుగుతున్న దాడులను ప్రతిఘటించడానికి షీ టీమ్స్ కృషి చేయాలి అన్నారు. 2029 తర్వాత పార్లమెంట్లో మహిళా ఎంపీల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అన్నారు.