ద్రోణి ప్రభావంతో కురుస్తున్న వర్షాల కారణంగా గంట్యాడ మండలంలోని తాటిపూడి జలాశయం నీటిమట్టం బుధవారం మధ్యాహ్నం నాటికి 292.4 అడుగులకు పెరిగింది. కొండవాగులు నదీ పరివాహక ప్రాంతాల నుంచి తాటిపూడి జలాశయంలోకి వరద నీరు వచ్చి చేరుతుండడంతో తాటిపూడి జలాశయం నీటిమట్టం బుధవారం మధ్యాహ్నం నాటికి 292.4 అడుగులకు చేరుకుంది. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 297 అడుగులు.