శ్రీకాకుళం జిల్లా, సారవకోట మండలం ,బుడితిలో 94 లక్షల రూపాయలతో నిర్మించిన వసతి గృహాల భవనాలను ఎమ్మెల్యే గారు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న బాలికలకు మౌలిక వసతులు కల్పనకు ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుందని తెలిపారు.ఈ వసతి గృహాన్ని బాలికలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ చిన్నాల కూర్మినాయుడు గారు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ అధికార ప్రతినిధి ధర్మాన తేజ్ కుమార్ గారు, సారవకోట పిఎసిఎస్ చైర్మన్ సురవరపు తిరుపతిరావు గారు, మండల పార్టీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.