శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి మండలంలో గురువారం మధ్యాహ్నం జిల్లా ఎస్పీ రత్న ఆదేశాల మేరకు శక్తి టీం పోలీసులు మహిళలకు అవగాహన కల్పించారు. ప్రమాద సమయంలో శక్తి యాప్లోని SOS బటన్ నొక్కినా లేదా 112, 1091, 1098, 181, 1930కు కాల్ చేసినా ఐదు నిమిషాలలో పోలీసులు చేరుకుంటారని తెలిపారు. చైన్ స్నాచింగ్, ఈవో టీజింగ్ వంటి సందర్భాల్లో ఈ యాప్ ఉపయోగకరమని సూచించారు.