కూటమిపాలన రాక్షస పాలన కొనసాగిస్తుందని వైసిపి పిఏసి సభ్యులు మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో వినుకొండ పట్టణంలో భాగంగా మాట్లాడుతూ కొంతమంది పోలీసులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని పోలీస్ స్టేషన్ అంటేనే బూతులు పర్వంగా మారింది అన్నారు. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు అనుమతులు తెచ్చిన మెడికల్ కాలేజీలు నేడు ప్రైవేటు పరం చేయడం సిగ్గుచేటు అని అన్నారు. యాక్టివ్ గా ఉన్న వైసిపి సోషల్ మీడియా కార్యకర్తలను అన్యాయంగా అరెస్టు చేస్తున్నారని తెలియజేశారు.