కూకట్పల్లిలో రాకేష్ నివాసానికి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గురువారం మధ్యాహ్నం చేరుకొని వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరమైన మీడియాతో మాట్లాడుతూ మహిళ హత్య కేసు బాధించిందని అన్నారు. చేతులు కట్టేసి చంపేయడం ఏంటని ఆయన అన్నారు. ఇటీవల చిన్నపిల్లను చంపేయడం బాధించిందని ఎమ్మెల్యే అన్నారు. హైదరాబాద్ నగరంలో లా అండ్ ఆర్డర్ తప్పిందని ఎమ్మెల్యే ఆరోపించారు. హంతకులకు తగిన బుద్ధి చెప్పాలని పోలీసులకు సూచించారు.