కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ,అని ఎన్నికల సమయంలో కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేసి తీరుతామన్నారు, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాకుండా విద్యా, ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్ కొనసాగిస్తామన్నారు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు.ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు ఎమ్మెల్యే గండ్ర.బీసీ డిక్లరేషన్ బహిరంగ సభ ఈ నెల 15 నిర్వహించనున్న నేపథ్యంలో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు.