వినాయక ఉత్సవాలపై ప్రభుత్వం, పోలీసులు షరతులు పెట్టడం దుర్మార్గమని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు విమర్శించారు. ఆదివారం విజయవాడలోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.