జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా డోన్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో కొత్తగా నిర్మించిన ఫుట్ బాల్ కోర్టును ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. యువతలో క్రీడాస్ఫూర్తి పెంపొందించడమే కాకుండా, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి క్రీడలు ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యాయులు ఇతర అధికారులు పాల్గొన్నారు.