టక్కోలి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది గ్రామంలో నివాసం ఉన్న వెంకట లక్ష్మమ్మ, సుబ్బయ్య అనే దంపతుల కుమార్తె తిరుపతమ్మ(18) తన స్వగృహంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో పై కప్పుకు చీర కొంగుతో ఉరి వేసుకుని మంగళవారం మృతి చెందడంతో తల్లిదండ్రులు బోరుమంటూ తల్లడిల్లు పోయారు మృతిచెందిన తిరుపతమ్మ తల్లి జీవనోపాధి నిమిత్తం రైతు పనికి వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చే లోపల ఇంట్లో పైకప్పుకు చీరతో మెడకు ఉరి వేసుకుని మృతి చెందిన యువతి తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదు నిమిత్తం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది.