వినాయక చవితి వేడుకను ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు ఉంటాయని డీఎస్పీ రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. శనివారం మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ రాజేంద్రప్రసాద్, సీఐ రమణారెడ్డిలు మాట్లాడుతూ..విగ్రహాల ఏర్పాటుకు ఎటువంటి రుసుములు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు.