దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలని పార్టీ శ్రేణులకు మాజీ ఎంపీ తలారి రంగయ్య పిలుపునిచ్చారు. కళ్యాణదుర్గం లో మంగళవారం వైయస్సార్ విగ్రహం వద్ద వైయస్సార్ 16వ వర్ధంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కొరకు ఎంతగానో కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.