శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్లలోని రావికుంట సమీపంలో కృష్ణ జింక పిల్ల దారి తప్పి బుధవారం మధ్యాహ్నం జనావాసంలోకి వచ్చింది. గమనించిన స్థానిక యువకులు దానిని పట్టుకొని గోరంట్ల సీఐ శేఖర్కు అప్పగించారు. ఆయన అటవీశాఖ అధికారులను పిలిపించి, జింక పిల్లను వారికి అప్పగించారు. వైద్య పరీక్షల అనంతరం జింక పిల్లను అటవీ ప్రాంతంలో వదిలి పెట్టారు.