జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ లో గిరిజన ఆశ్రమంలో అభిమాన టీచర్ కోసం విద్యార్థినులు ఆందోళనకు దిగారు.తమ సార్ ను ఎందుకు డిప్యూటేషన్ చేశారంటూ నిరసనకు శనివారం విద్యార్థులు నిరసన చేపట్టారు.ఉదయం నుండి మంచినీళ్లు కూడా ముట్టకుండా తమ నిరసన కొనసాగించారు.ఉన్నతాధికారులు వచ్చి డిప్యూటేషన్ రద్దు చేశామని చెప్పే వరకు ఏమి తినమని విద్యార్థులు భీష్మించుకు కూర్చున్నారు.తప్పు చేసిన వారిని ఇక్కడే ఉంచి తప్పు చేయని తమ సర్ ను పంపడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.విద్యార్థుల నిరసన నేపద్యంలో ఆశ్రమ పాఠశాలకు ఆర్డీవో చేరుకొని కలెక్టర్ తో మాట్లాడారు.కలెక్టర్ హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు