సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల కేంద్రం సమీపంలో కారు అదుపుతప్పి బోల్తా కొట్టిన సంఘటన చోటు చేసుకుంది. న్యాల్కల్ మండలంలోని ఇబ్రహీంపూర్ నుండి హైదరాబాద్ వెళ్తున్న కారు న్యాల్కల్ గ్రామ సమీపంలోని సబ్ స్టేషన్ వద్ద గురువారం మధ్యాహ్నం అదుపుతప్పి బోల్తా కొట్టింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న తల్లి కొడుకు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వెంటనే గుర్తించిన స్థానికులు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.