కామారెడ్డి పట్టణ పరిధిలోని దేవునిపల్లి PHC లో శనివారం మాంటెక్స్ టీబీ టెస్ట్లు ప్రారంభించినట్లు మెడికల్ ఆఫీసర్ డా. జోహా తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. టీబీ లక్షణాలతో బాధపడుతున్న వారికి, టీబీ వ్యాధిగ్రస్తుల కుటుంబ సభ్యులకు చర్మం ద్వారా నిర్ధారించే మాంటెక్స్ టీబీ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. TB వ్యాధి అంతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. టీబీ సూపర్వైజర్ చంద్రకాంత్, సిబ్బంది పాల్గొన్నారు.