కళ్యాణదుర్గం మండలం మల్లాపురం గ్రామానికి చెందిన కుల్లాయమ్మ అనే మహిళ ఈ నెల రెండో తేదీన అనారోగ్యంతో గుత్తి ఆసుపత్రిలో చేరింది. ఓ వ్యక్తి ఆటోలో తీసుకొచ్చి ఆస్పత్రుల్లో అడ్మిట్ చేయించి వెళ్ళాడు. అయితే ఆమె కొరకు ఇంతవరకు ఎవరూ రాలేదు. ఈమెకు భర్త, కుమారుడు, కుమార్తె ఉన్నట్లు ఆస్పత్రి వైద్యులు చెప్పారు. ప్రస్తుతం ఆమె చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నది. కుటుంబ సభ్యులు వచ్చి ఆమెను తీసుకెళ్లాలని గురువారం ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి.