మామిడికుదురు మండలం బి.దొడ్డవరం గ్రామానికి చెందిన వృద్ధుడు రవణం సాయిబాబు (78) మంగళవారం గోదావరి నదిలో గల్లంతయ్యాడు. ఒలుపు కార్మికుడైన సాయిబాబు బహిర్భూమికి వెళ్లి గోదావరిలో కొట్టుకు పోయాడని కుటుంబ సభ్యు లు తెలిపారు. సాయిబాబు కుమారుడు పల్లంరాజు రెవెన్యూ అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గల్లంతైన వృద్ధుడి కోసం బోట్లలో రెవెన్యూ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.