తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని పెరిటిపాడు పరిసర ప్రాంతంలో డంపింగ్ యార్డ్ కోసం స్థలం కేటాయించిన విషయం విధితమే. అయితే ఆ ప్రదేశంలో చెత్త వేసేందుకు శనివారం మళ్లీ ట్రాక్టర్లు వెళ్లాయి. దీంతో సమీపంలోని పెరమిటిపాడు గ్రామ మహిళలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడికి చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. అసలే గ్రామంలో ఫ్లోరైడ్ సమస్యతో అల్లాడుతున్నమని, మళ్లీ ఇప్పుడు ఇక్కడ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తే అంటు రోగాలు ప్రబలి ప్రాణాలకే ముప్పు వాటిల్లే అవకాశం ఉందని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి ట్రాక్టర్లను అడ్డుకొని నిరసన తెలిపారు. తమ గ్రామం వద్ద చెత్త