తాళ్ళరేవు మండలం, సుంకరపాలెం వద్ద అక్రమంగా తరలిస్తున్న 20 టన్నుల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రేషన్ బియ్యాన్ని లారీలో రవాణా చేస్తుండగా కోరంగి పోలీసులు దానిని అడ్డగించి, లారీతో సహా బియ్యాన్ని కోరంగి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బియ్యాన్ని ఎక్కడి నుండి ఎక్కడికి తరలిస్తున్నారనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు.