ఆదమరిస్తే అంతే సంగతులు,పొంచి ఉన్న ప్రమాదం,రోడ్డుకు ఆనుకొని బావి,ఫెన్సింగ్ వేయించి జాగ్రత్తలు చేపట్టారు.ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గాంధీనగర్ తండా నుండి కిష్టాపురం వెళ్లే బిటి రోడ్ లో ప్రమాదం పొంచి ఉంది.రోడ్ అంచుకు అనుకొని బావి ఉంది కొంచెం బ్యాలెన్స్ తప్పిన బావిలో పడే అవకాశం ఉంది.దానికి ఫెన్సింగ్ లేకపోవడంతో అటు వెళ్లి వాహనాలు ప్రమాదవశాత్తు అందులో పడే ప్రమాదం ఉంది. ఈ మార్గం నుండి చాలా వాహనాలు వెళుతూ ఉంటాయి.ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు చేపట్టాలని అటుగా వెళ్ళే ప్రజలు కోరుతున్నారు.