కడప జిల్లా జమ్మలమడుగులోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో శుక్రవారం ప్రధానమంత్రి టీ.బి ముక్తభారత అభియాన్ ఇంటెన్సిఫైడ్ టీ.బీ వ్యాధి గురించి అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో టిబి సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ రవిశంకర్ మాట్లాడుతూ టీబీ వ్యాధిగ్రస్తులు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ఎదుటివారిపై పడే తుంపర్ల ద్వారా ఒకరి నుండి ఒకరికి వస్తుందని తెలిపారు. టీ.బి సూపర్వైజర్ మునిస్వామి మాట్లాడుతూ నిర్ధారణ కొరకు సిబి నాట్ పరీక్ష చేయించుకోవాలని చెప్పారు.