పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో స్కౌట్ యూనిట్ను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని DEO సుబ్రహ్మణ్యం సూచించారు. రాయచోటిలోని డైట్ నందు మంగళవారం పాఠశాలల ప్రిన్సిపల్స్, ప్రధానోపాధ్యా యులు, యూనిట్ లీడర్లకు శిక్షణ ఇచ్చారు. జిల్లాలోని 39 పీఎం పాఠశాలల్లో స్కౌట్ కార్యకలాపాల కోసం సమగ్ర శిక్ష ద్వారా కేటాయించిన రూ.50 వేలను నిబంధనల ప్రకారం ఖర్చు చేయాలన్నారు.