కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం పరిధిలోని ముద్దనూరు మండలం ఒంటిగారిపల్లె గ్రామంలో గురువారం పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించినట్లు మండల వ్యవసాయ అధికారి వెంకట క్రిష్ణారెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో గ్రామ సభ ఏర్పాటు చేసి రైతులు సాగు చేసిన పంట సాగు వివరాలు అడిగి తెలుసుకున్నామన్నారు. గ్రామంలో రైతులు మాట్లాడుతూ వామి కొండ డ్యామ్ కట్ట క్రింది భాగాన ఉన్న పంట పొలాలు నీటి తేమ ఎక్కువ అవ్వడం వల్ల పంటలు సరిగా మొలకెత్తక, పంట దిగుబడులు రాక నష్టపోతున్నామనితెలిపారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామని తెలిపారు.