వినాయక చవితి పండుగను పురస్కరించుకుని రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కుటుంబ సమేతంగా తన నివాసంలో గణపతి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, గణనాధుడు ఆశీస్సులు ప్రసాదించాలని ఆకాంక్షించారు. సమాజంలో శాంతి, ఐశ్వర్యం, ఐక్యత నెలకొనాలని ప్రార్థించారు.