రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రజలు మెచ్చే భాష మాట్లాడాలని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే కాలమే సరైన సమాధానం చెబుతుందని ఆయన అన్నారు. తనను వ్యక్తిగతంగా విమర్శించిన కాకాని ఎక్కడికి వెళ్ళాడో అందరూ చూసారని మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకి వెంకటాచలంలో వ్యాఖ్యానించారు.