యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వెంకటాపురం గ్రామ పరిధిలోని శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా మూసివేశారు. ఆదివారం ఉదయం నిత్య కైకేర్యాలు పూర్తిచేసి ఆగమ శాస్త్ర రూపంలో బంధనవేసి తలుపులను మధ్యాహ్నం మూసివేశారు. తిరిగి సోమవారం ఉదయం 7 గంటల తర్వాత దర్శనాలకు అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆలయ చైర్మన్ నరేష్ రెడ్డి కార్యనిర్వహణ అధికారి సిబ్బంది అర్చకులు తదితరులు పాల్గొన్నారు.