FLN సర్టిఫికెట్ కోర్సులను ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలని డివై ఈవో చంద్రశేఖర్ తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం 12.30 లకు ఆయన చాంబర్ నుండి మీడియాకు వెల్లడిస్తూ నగరంలోని కన్నన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు, ప్రీ ప్రైమరీ ఉపాధ్యాయులకు, ఐసిడిఎస్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమాన్ని సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నమన్నారు. ఇందులో భాగంగా వారికి ఉత్తమ నైపుణ్యం సామర్ధ్యాలు విద్యార్థులలో పెంపొందించడానికి వృత్తి నైపుణ్యాలు పెంపొందించడానికి శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు