ప్రధాని నరేంద్ర మోడీ మాతృమూర్తి పై రాహుల్ గాంధీ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసిస్తూ బిజెపి శ్రేణులు ఆందోళన చేపట్టారు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం గంగ్వర్ చౌరస్తా వద్ద మండల పార్టీ అధ్యక్షులు మల్లేష్ ఆధ్వర్యంలో ఆదివారం మధ్యాహ్నం బిజెపి నాయకులు నిరసన చేపట్టి రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వెనుకకు తీసుకుని ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న హద్నూర్ పోలీసులు బిజెపి నాయకులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు.