నంద్యాల జిల్లా మహానంది ఆలయ పరిధిలోని కరివేన సత్రం సమీపంలో శుక్రవారం ఉదయం నల్ల నాగు పాము కలకలం రేపింది. పామును గుర్తించిన స్థానికులు వెంటనే అయ్యన్ననగర్ గ్రామానికి చెందిన స్నేక్ క్యాచర్ మోహన్కు సమాచారం అందించారు. ఆయన ఘటనా స్థలానికి చేరుకుని బండల సందులో ఇరుక్కున్న నాగుపామును పట్టుకుని సమీపంలోని నల్లమల అడవిలో వదిలేశాడు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో పాములు ఎక్కువగా కనిపిస్తున్నాయని జాగ్రత్తగా ఉండాలని అధికారుల సూచిస్తున్నారు. అత్యంత ప్రమాదకరమైన నల్ల నాగులు నల్లమల అడవి ప్రాంతంలో సంచరిస్తుంటాయి.