ఏపీ రజక వృత్తిదారుల సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట భారీగా ధర్నా జరిగింది. జిల్లా ట్రెజరర్ సిహెచ్. శ్రీనివాసులు, ఓల్డ్ సిటీ కార్యదర్శి సి.జయమ్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు సి. గురుశేఖర్, కర్నూలు సిటీ కార్యదర్శి సి. శేషాద్రి, మహిళా నాయకురాలు ఈఎల్‌ఎస్. రత్తమ్మ పాల్గొన్నారు.భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 79 ఏళ్లు పూర్తయినా రజకులపై దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు, మహిళలపై అత్యాచారాలు, హత్యలు ఆగకపోవడం దురదృష్టకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అగ్రవర్ణాల వారి పెత్తందారీ చర్యలతో రజకులు శ్రమదోపిడీకి గురవుతున్నారని