చింతకాని మండలం నాగులవంచ సమీపంలో బండిరేవు వాగు ఉధృతంగా ప్రవహించడంతో, నాగులవంచ నుండి పాతర్లపాడు, రైల్వే కాలనీ, బోనకల్లు మండలం రామాపురానికి రాకపోకలు నిలిచిపోయాయి.. రహదారిపై ఐదు అడుగుల మేర వరద ప్రవహిస్తుండడంతో పోలీసులు ట్రాక్టర్లను అడ్డుగా పెట్టి చేసి రవాణాను నిలిపివేశారు.. ఉప్పొంగిన వాగులు, వంకలు దాటడానికి సాహసాలు చేయవద్దని పోలీసులు ప్రజలకు సూచించారు..