Parvathipuram, Parvathipuram Manyam | Aug 27, 2025
డాక్టర్ కుప్పా నాయుడు ఆశయ సాధనకు కృషి చేద్దామంటూ ప్రజాసంఘాల నాయకులు ఘన నివాళులర్పించారు. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంటలో దివంగత సిపిఎం నాయకుడు డాక్టర్ కుప్పా నాయుడు వర్ధంతి సందర్భంగా బుధవారం సాయంత్రం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యుడు బోను గౌరనాయుడు, కార్మిక సంఘం నాయకుడు వెంకటరమణ, సిఐటీయు నాయకుడు ఈశ్వరరావు తదితరులు మాట్లాడుతూ డాక్టర్ కుప్పా నాయుడు ఉమ్మడి విజయనగరం జిల్లాలో వ్యవసాయ కార్మిక సంఘం వ్యవస్థాపకుడిగా కార్మికుల కోసం ఎన్నో పోరాటాలు చేశారన్నారు.