కర్నూలులోని డాక్టర్ అబ్దుల్ హక్ యునాని వైద్య కళాశాలకు చెందిన విద్యార్థినులు డా. సమ్రీన్ సుల్తానా, డా. అరిఫా షేక్ గోల్డ్ మెడల్స్ సాధించారు. బుధవారం ఉదయం 12 గంటలు విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో 27, 28వ కాన్వకేషన్లో గవర్నర్ అబ్దుల్ నజీర్, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ చంద్రశేఖర్ పతకాలు ప్రదానం చేశారు. వైద్య విద్యార్థినులను ప్రిన్సిపల్ డా.మీర్ జైనుల్లా అభిదీన్ అభినందించారు.