గూడూరు గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డికె బాలాజీ జిల్లాలో యూరియా కొరత లేదని, రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం 5 గంటల 30 నిమిషాల సమయంలో జిల్లా కలెక్టర్ స్తానిక పెడన నియోజకవర్గంలోని గూడూరు గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడి రైతులతో యూరియా సరఫరా, పంపిణీ పై ముఖాముఖి మాట్లాడారు. ఆ గ్రామ రైతులు మాట్లాడుతూ తమకు 2 డోసుల యూరియా వచ్చిందని, 3 వ డోసు యూరియా పంపిణీ చేయాల్సి ఉందన్నారు.