శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి టీడీపీ కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి సీఎం సహాయనిది చెక్కులు పంపిణీ చేశారు. నియోజవర్గం వ్యాప్తంగా సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న 24 మందికి రూ.24,12,826ల చెక్కులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మాట్లాడుతూ సీఎం సహాయనిధి పేదల పాలిట వరమని ఆమె కొనియాడారు.