దొంగిలించిన కేసును చేధించిన పోలీసులు సత్యవేడు ఎస్బీఐ ఏటీఎంలో కన్నవరానికి చెందిన రవికి మోసగించి, అతని కార్డును మార్చి రూ.40,000 దొంగిలించిన కేసును సత్యవేడు పోలీసులు ఛేదించారు. డీఎస్పీ రవికుమార్ సూచనల మేరకు ఎస్సై రామస్వామి బృందం, ఏటీఎం సీసీఫుటేజీల ఆధారంగా ఏర్పేడుకు చెందిన ముని సుబ్రహ్మణ్యంను అరెస్ట్ చేసి, రూ.40,000 నగదును రికవరీ చేశారు. నిందితుడిపై గతంలోనూ పలు పోలీస్ స్టేషన్లలో ఇలాంటి కేసులు ఉన్నాయని తెలిపారు.