విజయవాడ వాంబే కాలనీ మున్సిపల్ హైస్కూల్ హెడ్ మాస్టర్ మనోహర్, సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యా యుడిగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని అన్నారు. వాంబే కాలనీలో శుక్రవారం జరిగిన రాధాకృష్ణన్ జయంతి వేడుకల్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణన్ను స్మరించుకుంటూ మనోహర్ ఆలపించిన గీతం అందరినీ ఆకట్టుకుంది.