నేపాల్ లో చిక్కుకున్న తెలుగువారిని రక్షించడంలో అండగా నిలిచిన టీడీపీ యువ నాయకులు, మంత్రి నారా లోకేష్ చొరవ ఎంతో అభినందనీయమని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. చిన్న వయసులోనే ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వాన్ని నడిపించడంలో లోకేష్ ఎంతో కీలకపాత్ర వహిస్తున్నారని ఆయనను ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రత్యేకంగా అభినందించారు.