గోదావరి వరద ఉద్ధృతి క్రమేపి తగ్గుతోంది. అప్పనపల్లి కాజ్వేను ఇంకా వరద నీరు వీడలేదు. ఆదివారం కాజ్వేపై అడుగుకు పైగా వరద నీరు ప్రవహిస్తోంది. ఆ వరద నీటిలోనే తీవ్ర ఇబ్బందులు పడుతూ అప్పనపల్లి, పెదపట్నంలంక, బి.దొడ్డవరం గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. సాయంత్రానికి కాజ్వేపై వరద నీరు పూర్తిగా తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు.