Rampachodavaram, Alluri Sitharama Raju | Aug 27, 2025
అల్లూరి జిల్లాలో గడచిన 24గంటల్లో నమోదు అయిన వర్షపాతం వివరాలను అధికారులు బుధవారం రాత్రి తెలిపారు. జిల్లాలో 645.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా అత్యధికంగా పెదబయలు మండలంలో 65mm నమోదు అవ్వగా, హుకుంపేటలో 52.6mm, చింతూరులో 51.2mm, మారేడుమిల్లిలో 51.2mm, గూడెం కొత్తవీధిలో 44.6mm, పాడేరులో 41.2mm, 38.4mm, వీఆర్ పురంలో 30.2, ఎటపాకలో 28.6mm, జి.మాడుగులలో 28.2mm నమోదు అయ్యింది. మిగిలిన మండలాల్లో మాదిరి వర్షం కురిసింది.