వికారాబాద్ జిల్లా మర్పల్లి మండల కేంద్రంలో బుధవారం బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభం అనంతరం బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై మర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సురేష్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని స్పీకర్ పేదల పక్షపాతి అని వికారాబాద్ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు.