పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం నూజెండ్ల మండలం వి, అప్పాపురంలో డ్వాక్రా మహిళలు మోసపోయారు గతంలో గ్రూప్ లీడర్ గా పని చేసిన మహిళలపై 50 మంది డ్వాక్రా సంఘ సభ్యులు బుధవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఐయినవోలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బ్యాంకుల్లో జమ చేస్తానని నమ్మించి సభ్యుల నుంచి సుమారు 20 లక్షలు తీసుకున్న నగదు జమ చేయకపోవడంతో మహిళలు మోసపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని న్యాయం చేయాలని పోలీసులను కోరారు.