శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తిలోని మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి నివాసంలో బుధవారం మధ్యాహ్నం వైసీపీ అనుబంధ విభాగాల జిల్లా కమిటీలతో సమావేశం నిర్వహించారు. సమావేశానికి జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్, పార్లమెంట్ పరిశీలకుడు రమేశ్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కూటమి ప్రభుత్వంపై పోరాటంలో అనుబంధ కమిటీలు ముఖ్య భూమిక పోషించాలని వారు సూచించారు.