Parvathipuram, Parvathipuram Manyam | Aug 28, 2025
విద్యుత్ సంస్కరణ చట్టాల అమలుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంబానీ ఆదానీలకు ప్రజల సంపదను అంటగట్టే ప్రయత్నం చేస్తుందని వామపక్ష, ప్రజాసంఘాల నాయకులు పేర్కొన్నారు. విద్యుత్ ఉద్యమానికి 25 ఏళ్లు నిండిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా గురువారం పార్వతీపురం సుందరయ్య భవనం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం అమరుల త్యాగాల స్ఫూర్తికై ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 2000 సంవత్సరంలో ఆగస్టు 28వ తేదీన బషీరాబాద్లో పెంచిన విద్యుత్తు చార్జీలుకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఆనాటి టిడిపి ప్రభుత్వం అణచివేతకు పాల్పడిందన్నారు.